మంచి ముహూర్తం కోసం
ఈ రెండు రోజుల్లో ఏ సమయంలో నామినేషన్ దాఖలు చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అయ్యగార్లను పోటీదారులు సంప్రదిస్తున్నారు. వారు చెప్పిన సమయంలోనే నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ పత్రాలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి వెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆయా వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పార్టీలు వేగం పెంచాయి. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో కసరత్తు ముమ్మరం చేశారు. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న చోట అందరిని నామినేషన్లు వేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి సమయంలో బీఫాంలను నేరుగా ఎన్నికల అధికారులకు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ పెద్దలు సర్వే ఆధారంగానే అభ్యర్థులను గుర్తించి వారికే బీఫాం అందజేయనున్నారు. అశావహులు మాత్రం తమకే కేటాయించాలని పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.


