‘ఉపాధి’ పథకాన్ని ఎత్తివేసే కుట్ర
చిన్నశంకరంపేట(మెదక్): మహాత్మాగాంధీ జాతీ య ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. బుధవారం మండల ంలోని కొర్విపల్లిలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఉపాధి కూలీలతో నిర్వహించిన సభలో మాట్లాడారు. పథకం పేరు మార్చి పెద్ద కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు గ్రామ సభ ద్వారా పనులు గుర్తించే అధికారం, ఉండగా కొత్త చట్టం ప్రకారం కేంద్రం నిర్ణయించిన పనులు మాత్రమే చేయాలన్నారు. గ్రామీణ కూలీలకు అన్యాయం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వంపై పోరాటం ఆగదన్నారు. ‘ఎఆర్‌ఈజీఎస్ ముద్దు.. బీజేపీ వద్దు’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. అంతకుముందు మీనాక్షి నటరాజన్ ఉపాధి కూలీలతో నేరుగా మాట్లాడారు. ఎఆర్‌ఈజీఎస్ పథకం అమలు కాకముందు ఎలాంటి ప నులు చేసేవారు, ఎంత కూలీ వచ్చేదని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అలాగే కొర్విపల్లి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, డీసీసీ అధ్యక్షుడు అంజనేయులుగౌడ్, నర్సాపూర్, దుబ్బాక ఇన్‌చార్జిలు రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డితో పాటు నాయకులు త దితరులు పాల్గొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్


