ఇద్దరిని మాత్రమే అనుమతించాలి: అదనపు ఎస్పీ
మెదక్ కలెక్టరేట్: నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించాలి అదనపు ఎస్పీ మహేందర్ ఆదేశించారు. బుధవారం మెదక్ మున్సిపల్ కార్యాలయం వద్ద బందోబస్తును పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ సీఐ మహేశ్, ఎస్‌ఐలు లింగం, విఠల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


