ఓటేద్దాం.. భవిష్యత్‌ను నిర్ణయిద్దాం
మెదక్ కలెక్టరేట్/మెదక్‌జోన్: ప్రతి ఓటరూ తమ ఓ టు హక్కుకు వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో అన్ని విభాగాల ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో ‘నా భారత్– నా ఓటు’ నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా నమోదైన ఓటర్లను గుర్తించి వారికి ఓటరు గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌ఓ భుజంగరావు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్‌ల మొ దటి విడత శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పొందిన శిక్షణను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కేవలం సర్పంచ్‌లపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
మెదక్ కలెక్టరేట్: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని హైదరాబాద్ నుంచి ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు ఆర్‌ఓలు, ఏఆర్‌ఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు.


