సరస్వతీ నమస్తుభ్యం
వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం ఏడుపాయల వనదుర్గామాత భక్తులకు సరస్వతి మాత అలంకారంతో దర్శనమిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పత్యేక పూజలు చేశారు. అలాగే వర్గల్ విద్యా సరస్వతిదేవి క్షేత్రం చిన్నారుల అక్షరాభ్యాసాలలో అలరారింది. సకల విద్యలకు మూలమైన విద్యాసరస్వతి అమ్మవారు స్వర్ణ కిరీటాది విశేషాభరణాలతో దివ్యదర్శనమిచ్చారు. సుమారు 6,000 వరకు చిన్నారుల అక్షరాభ్యాసాలు జరగగా, రోజంతా క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
– పాపన్నపేట(మెదక్)/వర్గల్(గజ్వేల్)
సరస్వతీ నమస్తుభ్యం


