పుర పోరులో సత్తా చాటుదాం
తూప్రాన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌పై నమ్మకంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారని తెలిపారు. కేటీఆర్ ప్ర జలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అయినా బీఆర్‌ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదన్నారు. అవినీతిలో మునిగిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 40 వేల ఉద్యోగాల ఇస్తామన్నారు. విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తూప్రాన్‌కు డిగ్రీ కళాశాల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన పలువులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, రవీందర్‌గుప్తా, భాస్కర్‌రెడ్డి, పెంటాగౌడ్, నాగరాజుగౌడ్, నారాయణగుప్తా, నందాల శ్రీనివాస్, భగవాన్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, మామిళ్ల కృష్ణ, సంతోశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు మంత్రి వివేక్ పిలుపు
బీఆర్‌ఎస్ అవినీతిలో
కూరుకుపోయిందని వ్యాఖ్య
తూప్రాన్‌లో ముఖ్య నాయకుల
సమావేశానికి హాజరు


