మహిళలకు మంచి తరుణం
గ్రూప్ సభ్యులకు వడ్డీలేని రుణాలు ఎన్నికల నేపథ్యంలో ఆగమేఘాలపై పంపిణీ మూడు బల్దియాల్లో చీరలు అందజేత
రామాయంపేట(మెదక్): మహిళా గ్రూపు సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో రెండేళ్లకు సంబంధించిన వడ్డీలేని రుణాలను (వీఎల్‌ఆర్)ను మంజూరు చేసింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో మొత్తం 854 గ్రూపులున్నాయి. వీటికి గత మూడేళ్లుగా వీఎల్‌ఆర్ రుణాలు అందలేదు. ఫలితంగా గ్రూపు సభ్యులు ఇబ్బందులపాలయ్యారు.
మున్సి‘పోల్స్’ పుణ్యమా అని..
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద వీఎల్‌ఆర్ నిధులు మంజూరు చేసింది. ఈమేరకు 2023–24, 2024– 25కు సంబంధించి జిల్లాకు రూ. 3.09 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. ఇటీవల మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నిధుల మంజూరుకు సంబంధించిన చెక్కులను మహిళలకు అందజేశారు. నర్సాపూర్‌లో మంత్రి వివేక్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎమ్మెల్యే సుతీతారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే చీరలను సైతం అందజేశారు. జిల్లా పరిధిలో రామాయంపేట మున్సిపాలిటీకి 5,040, నర్సాపూర్‌కు 6,000, తూప్రాన్‌కు 7,440 చీరలు మంజూరు కాగా, వాటిని మహిళలకు అందజేశారు. కాగా మెదక్ మున్సిపాలిటీకి ఇంకా మంజూరు కాలేదు. స్టాక్ వచ్చిన తర్వాత చీరలు అందజేస్తామని అధికారులు ప్రకటించారు.
జిల్లాలో ఇలా..
మున్సిపాలిటీ వడ్డీ తీసుకున్నవారు వచ్చిన నిధులు
మెదక్ 346 రూ. 90,24,810
నర్సాపూర్ 157 66,93,541
తూప్రాన్ 140 42,75,218
రామాయంపేట 211 1,09,53,152


