మణికొండ: హైదరాబాద్ నగర శివారు నార్సింగి సర్కిల్ కేంద్రంలో శుక్రవారం పశుసంక్రాంతి సందడిగా నిర్వహించారు. (Pashu Sankranthi) పండుగ తరువాత వచ్చే రెండో శుక్రవారం ఈ వేడుక నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలనుంచి పశువుల కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు సిటీకి వస్తారు.
బౌరంపేటకు చెందిన రాంరెడ్డి మాత్రం ఓ ముర్రాజాతి గేదెను రూ.3.50 లక్షలకు, మరో 9 ముర్రా, దులియా జాతి గేదెలను రూ.3.11లక్షల చొప్పున మొత్తం రూ. 32లక్షలకు కొనుగోలు చేశారు.
మిగతా గేదెలు రూ.లక్ష నుంచి మొదలుకుని రూ. 3లక్షల వరకు పలికాయి.
గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి గేదెలు, ఆవులను అందంగా ముస్తాబు చేసి అమ్మకానికి పెట్టారు.
పుంగనూరు జాతి ఆవులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


