దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ అర్బన్: జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026– 27 సంవత్సరానికి గాను 6వ తరగతి రెగ్యులర్, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓసీ విద్యార్థులు రూ. 200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ. 125 ఫీజుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉంటుందని తెలిపారు.
దర్గా ఉత్సవాల్లో మంత్రి
టేక్మాల్(మెదక్): హజరత్ షాహెదల్లా దర్గా ఉత్సవాల్లో శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు టేక్మాల్‌లోని కిందివాడ నుంచి గంధం, చాదర్‌ను ఊరేగింపుగా తీసుకొచ్చి దర్గాలో సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
జిల్లాకు 3 బహుమతులు
మెదక్ కలెక్టరేట్: దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాకు మూడు బహుమతులు లభించినట్లు డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికా రి రాజిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈనెల 19 నుంచి 23 వరకు సంగారెడ్డి జిల్లాలోని గాడియ మ్ స్కూల్, కొల్లూరులో నిర్వహించిన దక్షిణ భారతస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాపన్నపేట మండలం కొడుపాక జెడ్పీహెచ్‌ఎస్ టీచర్ వెంకటరమణ మొదటి స్థానం పొందినట్లు చెప్పారు. అలాగే తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి మూడవ స్థానం, సిద్ధార్థ రూరల్ హై స్కూల్ విద్యార్థి అక్షయ్ నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ రమేశ్ చేతుల మీదుగా బహుమతులను పొందినట్లు వివరించారు.
సమన్వయం అవసరం
నర్సాపూర్: విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం అవసరమని డీఐఈఓ మాధవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ చూ పాలని సూచించారు. లెక్చరర్లతో నిరంతరం సం బంధాలు కలిగి ఉండాలన్నారు. ప్రిన్సిపాల్ శేషాచారి కాలేజీలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం కళాశాలలో చదివి కానిస్టేబుళ్లుగా ఎంపికై న పూర్వ విద్యార్థులను సన్మానించారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని ఏఎస్పీ మహేందర్ అన్నారు. ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఐటీసీ పరిశ్రమ ఆధ్వర్యంలో ప్రత్యేక కా ర్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఒక్క కుటుంబానికే కాదు, సమాజానికి తీరని నష్టం కలిగిస్తాయన్నారు. ప్రస్తుతం హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కార్మికులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ సుభాశ్‌గౌడ్, ఫ్యాక్టరీ మేనేజర్ ఆనంద్, హెచ్‌ఆర్ మేనేజర్ శివం కల్రా, అడ్మిన్ మేనేజర్ నరసింహం, సేఫ్టీ మేనేజర్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
దరఖాస్తుల ఆహ్వానం
దరఖాస్తుల ఆహ్వానం


