రెండో రోజు260 నామినేషన్లు
● అత్యధికంగా మెదక్‌లో 103 దాఖలు
● రెండు రోజులు కలిపి మొత్తం 286
● నేటితో ముగియనున్న గడువు
మెదక్‌జోన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు గురువారం 260 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇందులో అత్యధికంగా మెదక్ బల్దియాలో 103 వచ్చాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధి లో మొదటిరోజు 26 మాత్రమే సమర్పించారు. కాగా రెండు రోజుల్లో కలిపి ఆ సంఖ్య 286కు చేరుకుంది. ఇందులో రెండు రోజుల్లో మెదక్‌లో 115, రామాయంపేటలో 58, తూప్రాన్‌లో 61, నర్సాపూర్‌లో 52 చొప్పున మొత్తం ఇప్పటివరకు 286 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు పే ర్కొన్నారు. కాగా శుక్రవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. చివరి రోజు భారీగా నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులు ఉండగా, మొత్తం 400 పై చిలుకు నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొందరు పెద్ద ఎత్తున ర్యాలీలతో నామినేషన్లు వేస్తున్నారు. దీంతో జిల్లాలోని బల్దియాల ఎదుట సందడి నెలకొంది. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కేవలం నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తుండగా, అధికారులు కంప్యూటర్లు, రికార్డులు బయట పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు.


