కృత్రిమ గర్భధారణతో ఆడదూడలు
పాపన్నపేట(మెదక్)/కౌడిపల్లి(నర్సాపూర్): గేదెల్లో కృత్రిమ గర్భధారణతో 90 శాతం ఆడదూడలు జన్మి స్తాయని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య తెలిపారు. గురువారం మండల పరిధిలోని పొడిచన్‌పల్లిలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించి, సకాలంలో పశువులు చూడి కట్టేలా చూసుకోవాలన్నారు. పుట్టిన లేగదూడలకు 15 రోజుల నుంచి ఆరు నెలల వరకు నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోశ్‌రెడ్డి, పశువైద్యాధికారి ప్రవీణ్, గోపాలమిత్ర సూపర్ వైజర్ శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. అలాగే కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో పశువైద్య శిబిరాన్ని పరిశీలించి మందుల పంపిణీ చేశా రు. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల పశు పోషకులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుత్‌బొద్దీన్, ఉపసర్పంచ్ రామాంజనేయులు, మండల పశువైద్యాధికారి ఫర్హిన్ ఫాతిమా, సిబ్బంది కిషన్, వీరారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య


