ఎన్నికల నియమావళి తప్పనిసరి
ఫిర్యాదులు త్వరగా
పరిష్కరించండి
అదనపు ఎస్పీ మహేందర్
తూప్రాన్: జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలని, గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ గణేష్‌రెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్‌గౌడ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎస్‌ఐలు సుభాష్‌గౌడ్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేట(నర్సాపూర్): ఫిర్యాదులను పరిష్కరించడంలో వేగం పెంచాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. గురువారం సాయంత్రం శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వివిధ కేసులకు సంబంధించి రికార్డులు, స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సిబ్బందికి సూ చించారు. నిత్యం వాహనాల తనిఖీ చేపట్టాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్‌ఐ సాయిలు, సిబ్బంది వీరస్వామి, మహేందర్, అనురాధ ఉన్నారు.


