కాంగ్రెస్ పతనానికి నాంది
గజ్వేల్: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలకనున్నాయని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటే రు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించమే కాకుండా సీఎంగా పదేళ్లు పాలించి.. రాష్ట్రం దశాదిశాలను మార్చిన కేసీఆర్‌పై కుట్రలను ప్రజలు సహించరని హెచ్చరించారు. రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకున్న రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్సన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మాదాసు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


