నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల ప్రచారం ముగిసిందని, ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం స్పష్టం చేశారు. సైలెన్స్ పీరియడ్‌లో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఈ అంశంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ రోజు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. జిల్లా ప్రజలు ఎన్నికల నిబంధనలను గౌరవించి పోలీస్‌శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం


