ఏడుపాయల జన సంద్రం
కొమురవెల్లిలో కోలాహలం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న చెంతకు ఆదివారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని గంగరేణి చెట్టు, రాజగోపురం, రాతిచక్రాలు, కోడెల స్తంభం, తోట బావి, ఎల్లమ్మ కమాన్, బస్టాండ్ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి.
పాపన్నపేట(మెదక్): ఏడుపాయలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు దుర్గమ్మ తల్లిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. ఆలయ సిబ్బంది, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
ఏడుపాయల జన సంద్రం
ఏడుపాయల జన సంద్రం
ఏడుపాయల జన సంద్రం


