కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలు

Feb 6 2026 11:43 AM | Updated on Feb 6 2026 11:43 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రామాయంపేట(మెదక్‌): మాజీ సీఎం కేసీఆర్‌ పాలన అవినీతిమయమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మెదక్‌ జిల్లా రామాయంపేటలో గురువారం నిర్వహించిన మున్సిపల్‌ విజయ సంకల్ప యాత్రలో పాల్గొని మాట్లాడారు. కేవలం ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ అభివృద్ధిని మ రిచారని ఆరోపించారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌, ఈరెండున్నర ఏళ్ల కాలంలో కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలని అభివర్ణించారు. గ్రామ గ్రామాన బెల్ట్‌షాపులతో పల్లెలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని, కాంగ్రెస్‌ నాయకులు భూములు అమ్ముకొని రూ. వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. నిరుపేద యువతుల వివాహాలకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎంపీ రఘునందన్‌రావు మా ట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి అడుగంటిందని ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ రహదారి నుంచి దామరచెరువు వరకు బైపాస్‌ రోడ్డులో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో కేన్స్‌ర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు పట్టణాధ్యక్షుడు అవినాశ్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, మండలాధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement