బుకింగ్‌ కాక.. యూరియా అందక! | - | Sakshi
Sakshi News home page

బుకింగ్‌ కాక.. యూరియా అందక!

Feb 6 2026 11:43 AM | Updated on Feb 6 2026 11:43 AM

బుకింగ్‌ కాక.. యూరియా అందక!

బుకింగ్‌ కాక.. యూరియా అందక!

అన్నదాతను వెంటాడుతున్న కష్టాలు

‘చిన్నశంకరంపేట మండలంలోని ఎస్‌.కొండాపూర్‌కు చెందిన నర్సుపల్లి లచ్చయ్య రెండెకరాల చిన్నరైతు. తన వద్ద స్మార్ట్‌ ఫోన్‌ లేకపోవడంతో యూరియా ఎలా బుక్‌ చేసుకోవాలనే విషయం తెలియదు. గవ్వలపల్లిలోని ఫర్టిలైజర్‌ దుకాణంలో యూరియా అందుబాటులో ఉందని తెలుసుకొని వెళ్లాడు. తీరా నిర్వాహకుడు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటేనే యూరియా ఇస్తామని తేల్చిచెప్పాడు. యూరియా బుక్‌ చేసుకోవడం తనకు తెలియని చెప్పగా, రైతువేదిక వద్దకు వెళ్తే అధికారులు బుక్‌ చేస్తారని చెప్పడంతో ప్రయాస పడుతూ చేరుకున్నాడు. అక్కడ చాంతాడంత క్యూలైన్‌ను దాటుకొని అధికారులను కలవడంతో వారు యూరియా బుక్‌చేశారు’. ఇలా జిల్లాలో అనేక మంది రైతులు ఆన్‌లైన్‌లో యూరియా బుక్‌ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): రైతులకు అగ్రికల్చర్‌ యాప్‌పై ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో యూరియా బుక్‌ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు యాప్‌ వివరాలు నమోదు చేసేందుకు అగ్రికల్చర్‌ యాప్‌ను మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవడంతో పాటు తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఫోన్‌లో ఎంటర్‌ చేసిన తర్వాతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేస్తేనే ముందుకు వెళ్లాలి. కాని చాలా వరకు ఓటీపీ కష్టాలు తప్పడం లేదు. ఒక వేళ వచ్చినా, వివరాలు పూర్తిగా నమోదు చేసి యూరియా బుక్‌ చేసే సమయంలో సెండ్‌ కాక తిరిగి మొదటికే వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2,62,043 మంది రైతులు ఉన్నారు. సాగు విస్తీర్ణం సుమారు 3,01,700 ఎకరాలు ఉంటుందని అధికారుల అంచనా. ఇందుకునుగుణంగా 28,800 టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 17 వేల టన్నులు జిల్లాలో అందుబాటులో ఉంది. అయినప్పటికీ నూతన ఆన్‌లైన్‌ యాప్‌ విధానంతో రైతులు యూరియా బుక్‌ చేసు కోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాస్తారోకోలు, క్యూలైన్‌లు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో యూరియా ఉన్నప్పటికీ అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొంత వరకు ఇబ్బందులు

జిల్లాలో అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. అగ్రికల్చర్‌ యాప్‌ కొ త్తగా వచ్చింది కాబట్టి సర్వర్‌ డౌన్‌తో పాటు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నా యి. రైతులకు సహాయం చేసేందుకు రైతు వేదికల వద్ద అధికారులు అందుబాటులో ఉంటున్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా వ్యవసాయ అధికారులను సంప్రదించి యూరియా బుక్‌ చేసుకోవాలి.

– డీఏఈ దేవ్‌కుమార్‌

రైతు వేదికల వద్ద క్యూలైన్లు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement