మెదక్‌ అభివృద్ధికి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

మెదక్‌ అభివృద్ధికి సహకరించండి

Feb 6 2026 11:43 AM | Updated on Feb 6 2026 11:43 AM

మెదక్‌ అభివృద్ధికి సహకరించండి

మెదక్‌ అభివృద్ధికి సహకరించండి

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

మెదక్‌ కలెక్టరేట్‌: కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి మెదక్‌ అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఏర్పాటుచేసిన కార్నర్‌ మీటింగ్‌ల్లో మాట్లాడారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, ఇతర పార్టీలకు ఓటేసి ప్రగతిని దూరం చేసుకోవద్దన్నారు. పట్టణ ప్రజలంతా కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ప్రభుత్వ పథకాలు పేరుకే పరిమితం అయ్యాయని, ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. ఎన్నికల అనంతరం తాగునీరు, రోడ్లు, మురికి కాల్వల నిర్మాణంలో దృష్టి సారిస్తా మని హామీ ఇచ్చారు. మెదక్‌ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి తెచ్చినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement