పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
మెదక్ కలెక్టరేట్: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు ద్వారా 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఉచిత శిక్షణ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ 1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో డిగ్రీ పూర్తి చేసి రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంట్రెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. మెరిట్ ఆధారంగా ఎస్సీలకు 75, బీసీలకు 15, ఎస్టీలకు 10 శాతం సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సింధు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ


