ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు

Jan 31 2026 9:28 AM | Updated on Jan 31 2026 9:28 AM

ఫోన్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు వందశాతం ఫలితాలు సాధించాలి లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి లెక్చరర్‌కు అభినందన

ఎంపీ రఘునందన్‌రావు

నర్సాపూర్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు నాటకాలు ఆడుతున్నాయని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో పార్టీ అభ్యర్థుల నామినేషన్‌ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. సిట్‌ నోటీసులు ఇవ్వడమే తప్ప, ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదన్నారు. ఒకరు కొట్టినట్లు, మరొకరు ఏడ్చినట్లు నటిస్తున్నారని అన్నారు. ఎన్నికల వేళ రోజూ పేపర్లలో రావడానికి నాటకాలు ఆడుతున్నారని, అందులో భాగంగానే కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చిందన్నారు. ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులతో నర్సాపూర్‌ అభివృద్ధి చెందిందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, నాయకులు పాల్గొన్నారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూస్తూ వారి అభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ విజయ అన్నారు. శుక్రవారం కౌడిపల్లి ప్రాథమిక పాఠశాల, భుజిరంపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం స్కూల్‌ కాంప్లెక్స్‌ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. చదువులో వెనుక బడిన విద్యార్థులను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి శిక్షణ ఇవ్వాలన్నారు. పీఎంశ్రీ నిధులతో విద్యార్థులకు మౌలిక వసతులు సమకూరుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలరాజు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు లలితాదేవి, ఓం ప్రకాశ్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మనోహరాబాద్‌(తూప్రాన్‌): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎంపీడీఓ రవీందర్‌కు సమ్మె నోటీస్‌ అందజేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులందరూ ఐక్యంగా పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆసిఫ్‌, కార్మిక నాయకులు స్వామి, అంజయ్య, అర్జున్‌, భాస్కర్‌, మహేష్‌, బాలమణి, అనురాధ, సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.

టేక్మాల్‌(మెదక్‌): వినూత్న కార్యక్రమాలతో విద్యా నైపుణ్యాలు ప్రదర్శించిన మోడల్‌ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్‌ భారతి ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాలలోని విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించడం, ప్రాక్టికల్స్‌, యూనిఫాంలో విభిన్న రీతిని అవలంభించడంలో భారతి ప్రత్యేకత చూపారు. ఈ విషయమై డైరెక్టర్‌ అఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ నీకోలస్‌, మోడల్‌ స్కూల్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసచారి అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. శుక్రవారం మోడల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సాయిలు, మండల అధికారులు, సిబ్బంది ఆమెను అభినందించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు 
1
1/3

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు 
2
2/3

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు 
3
3/3

ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో నాటకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement