పదేళ్లు ప్రజలకు ఏం చేశారు
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రామాయంపేట(మెదక్): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి అడుగంటిందని, అప్పుడు చేయని వారు ఇప్పుడు చేస్తారా..? అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రశ్నించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, పనిచేసే వారినే ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ నాయకుల వద్ద పెద్ద మొత్తంలో నల్లధనం ఉందని, వారి వద్ద డబ్బులు తీసుకొని ఓట్లు మాత్రం హస్తానికే వేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరనేది చూడకుండా.. తనను చూసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. ప్రజలు తమ ఓట్లను దుర్వినియోగం చేయొద్దని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అభివృద్ధికి రూ. కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఆయన వెంట పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి మహిపాల్‌రెడ్డి, పలు వార్డుల్లో పోటీ చేస్తున్న నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.


