అభాగ్యులకు భరోసా
మెదక్ కలెక్టరేట్: వేధింపులకు గురైన మహిళలకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని కేంద్రం కో ఆర్డినేటర్ సౌమ్య తెలిపారు. గురువారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో విద్యార్థినులు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా ఎలాంటి సహాయ సహకారం అయినా అందిస్తామన్నారు. అనంతరం షీటీం కో–ఆర్డినేటర్ ప్రమీల మాట్లాడుతూ.. గృహహింస, పనిచేసే చోట, విద్యా సంస్థలలో లైంగిక వేధింపులు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు యాసిడ్ దాడులు మొదలైన హింసల నుంచి రక్షణ కల్పించడమే షీటీం కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. క్షేత్ర సందర్శనలో అధ్యాపకులు సుధారాణి, హరిత, అరుంధతి, సాయిలీల, ఉదయశ్రీ, శోభారాణి, స్వాతి, విజయ్, ఏఎస్‌ఐ వెంకటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.


