కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
నర్సాపూర్: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులతో పాటు అన్నివర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మున్సిపల్ అభివృద్ధికి నిధులు రాలేదన్నారు. కార్యక్రమంలో సంగీత, అశోక్‌గౌడ్, మన్సూర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
‘పది’కి పక్కా ప్రణాళిక
పాపన్నపేట(మెదక్): పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని డీఈఓ విజయ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాల రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున ఉపాధ్యాయుల సూచన మేరకు విద్యనభ్యసించాలని సూచించారు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలన్నారు. ఈసారి జిల్లాలో శతశాతం ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, టీచర్లు వేణుగోపాల్, శివకుమార్, స్వర్ణ, వసంత, సుహాసిని, ఫణిరాజ్, కళావతి పాల్గొన్నారు.
చెడు వ్యసనాలకు
దూరంగా ఉండాలి
నర్సాపూర్ రూరల్: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నర్సాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని, జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ శ్రీధర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం ఆస్పత్రిలో అంతర్జాతీయ కేన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తంబాకు, పాన్ మసాలా, మాదకద్రవ్యాలు వాడడం వల్ల నోటి కేన్సర్‌తో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయమే శారీరక వ్యాయామం, యోగ, వాకింగ్ వంటి దినచర్య పాటించాలని సూచించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మధుశ్రీ, లీగల్ సర్వీసెస్ న్యాయవాది స్వరూపరాణి, ఆర్‌ఎంఓ డాక్టర్ రాజేష్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరళ, కవిత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో
ప్రసవాల సంఖ్య పెరగాలి
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన అన్నారు. మంగళవారం కౌడిపల్లి పీహెచ్‌సీలో ఆశవర్కర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసుకునేలా చూడాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రతీ నెల గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నాన్నారు. వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలన్నారు. తప్పనిసరి అయితే పెద్దాస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. నవజాత శిశువుల ఆరోగ్యానికి మెరుగైన వైద్య చికిత్స చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్, డాక్టర్ ఫెర్నాజ్, సీహెచ్‌ఓ ఎలిజబెత్‌రాణి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి


