సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
రామాయంపేట(మెదక్): మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖా యమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. మంగళవారం పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేసి మాట్లాడారు. ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతాయని తెలిపారు. తనతో పాటు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, పార్టీ రాష్ట్ర నాయకుడు హన్మంతరావు, నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ ఇన్‌చార్జి మహిపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, నాయకులు సరాపు యాద గిరి, బైరం కుమార్, శ్రీధర్‌రెడ్డి, మధునాల స్వామి, డాకి స్వామి, కమ్మరి రమేశ్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్


