ప్రలోభాలకు తావులేదు
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు తావు లేదని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికిరణ్ అన్నారు. మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని సూచించారు. అలాగే వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్


