వరకట్న రహిత సమాజం రావాలి | - | Sakshi
Sakshi News home page

వరకట్న రహిత సమాజం రావాలి

Feb 1 2026 10:39 AM | Updated on Feb 1 2026 10:39 AM

వరకట్న రహిత సమాజం రావాలి

వరకట్న రహిత సమాజం రావాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబీనా ఫాతిమా

సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబీనా ఫాతిమా

హవేళిఘణాపూర్‌(మెదక్‌): వరకట్నం లేని వివాహాలను ప్రోత్సహించాలని, అందుకు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబీనాఫాతిమా అన్నారు. శనివారం మండల పరిధిలోని స్కూల్‌ తండాలో వరకట్న నిషేధం అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పెళ్లికి ముందు వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నిషేధమని, ఇచ్చినా, తీసుకున్న నేరమన్నారు. వరకట్న వేధింపులతో ఎందరో మహి ళలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను నాశనం చేస్తున్న వరకట్నంను అందరూ నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు తమ తమ పిల్లలను చదివించి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచినప్పుడే వరకట్న రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. నాగరాజు, ఎస్‌ఐ సత్యనారాయణ, స్కూల్‌ తండా సర్పంచ్‌ గోపాల్‌నాయక్‌, పంచా యతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement