పచ్చిమిర్చి.. పనసకాయ | - | Sakshi
Sakshi News home page

పచ్చిమిర్చి.. పనసకాయ

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

పచ్చిమిర్చి.. పనసకాయ

పచ్చిమిర్చి.. పనసకాయ

‘పుర’ పోరులో చిత్రమైన గుర్తులు

మెదక్‌ కలెక్టరేట్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఈసారి ఓటర్లను ఆశ్చర్యపర్చేలా గుర్తులను ముందుకు తెచ్చింది. ‘కాదేది గుర్తుకు అనర్హం’ అన్నట్లుగా పచ్చిమిర్చి, పనసకాయ, బెండకాయ, తలుపులకు ఏర్పాటు చేసే గడియ, సాక్స్‌లు, టూత్‌ బ్రష్‌, పెన్‌డ్రైవ్‌, విద్యుత్‌ స్తంభం, లోడోగేమ్‌, బ్రెడ్‌ వంటివి ఎన్నికల గుర్తులకు ప్రకటించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు గుర్తుల ఫ్లెక్సీని మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. గతంలో కేవలం కత్తెర, కుండ, స్టవ్‌, టార్చిలైట్‌, టేబుల్‌, క్యారంబోర్డు వంటివే ప్రకటించేవారు. ఇప్పుడు అన్నీ ఎన్నికలకు గుర్తులుగా పనిచేస్తున్నాయంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement