పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

రామాయంపేట(మెదక్‌)/నిజాంపేట: రామాయంపేట పట్టణ అభివృద్ధి విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ తెలిపారు. సోమవారం రాత్రి పట్టణంలో పాదయాత్ర, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పట్టణంలోని కాలనీల్లో పర్యటించగా, శిథిలమైన రహదారులు, మురుగు కాలువలు కనిపించాయన్నారు. పదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. అన్ని కాలనీలను అద్దంలా మార్చే బాధ్యతగా తనదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నిజాంపేట మండల పరిధిలోని చౌకత్‌పల్లిలో పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మడవత్‌ సునీత, ఉప సర్పంచ్‌ రాములు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు అమరసేనారెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement