జాతీయస్థాయిలో రాణించాలి
తూప్రాన్: ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు గోవాలో జరిగే 22వ దక్షిణ భారత జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు రాణించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి రమేశ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో జరిగిన తెలంగాణ పురుషు లు, మహిళల జట్ల ఎంపిక నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధిస్తున్న క్రీడల్లో సాఫ్ట్‌బాల్ ముందుంటుందన్నారు అన్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు మాట్లాడుతూ.. జాతీయస్థాయి పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి రాణించాలన్నారు. ఎంపికకు వివిధ జిల్లాల నుంచి 102 మంది పురుషులు, 65 మంది మహిళలు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అభిషేక్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్‌గౌడ్, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్ శర్మ, క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.


