బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు

బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు

తూప్రాన్‌: పరిశ్రమల్లో బాల కార్మికులను నియమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆర్డీఓ జయచంద్రారెడ్డి హెచ్చరించారు. సోమవారం డివిజన్‌ పరిధిలోని అధికారులతో ఆపరేషన్‌ స్మైల్‌పై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ పరిశ్రమలు, వర్క్‌షాపులు, ఇతర సంస్థల్లో బాల కార్మికులు పనిచేస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. బాలకార్మికుల నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందుకోసం డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల్లో బాలకార్మికులను గుర్తి ంచాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్మిక చట్టాల అమలులో నిర్లక్ష్యం చూపిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో అలసత్వం వహించకూడదని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్లు, ఆర్‌ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్డీఓ జయచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement