అధికారుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

అధికారుల పాత్ర కీలకం

Feb 1 2026 10:39 AM | Updated on Feb 1 2026 10:39 AM

అధికారుల పాత్ర కీలకం

అధికారుల పాత్ర కీలకం

● కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ● ఎన్నికల విధులపై శిక్షణ

● కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ● ఎన్నికల విధులపై శిక్షణ

మెదక్‌జోన్‌: ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. ఈనెల 11న జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల విధులకు సంబంధించి ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు కలెక్టరేట్‌లో శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు ఒక రోజు ముందే చేరుకొని పోలింగ్‌ సామగ్రిని సరిచూసుకోవాలన్నారు. జోనల్‌ అధికారి పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అనంతరం మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షలపై హెచ్‌ఎంలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులు సెలవులు పెట్టొదన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళలో రెండు సార్లు స్నాక్స్‌ అందించాలన్నారు. వందశాతం ఉత్తీర్ణత శాతం సాధించే దిశగా కృషి చేయాలన్నారు.

ప్రజావాణి వాయిదా మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్‌తో పాటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉంటారని, ఎన్నికల అనంతరం మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement