ఫ్రీ బస్సు తప్ప.. అంతా తుస్సే.. | - | Sakshi
Sakshi News home page

ఫ్రీ బస్సు తప్ప.. అంతా తుస్సే..

Feb 8 2026 7:54 AM | Updated on Feb 8 2026 7:54 AM

ఫ్రీ బస్సు తప్ప.. అంతా తుస్సే..

ఫ్రీ బస్సు తప్ప.. అంతా తుస్సే..

తూప్రాన్‌: కాంగ్రెస్‌ పాలనలో ఉచిత బస్సు మినహా.. అంత తుస్సేనని, ప్రజలకు ఒరిగిందేమి లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం తూప్రాన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఫ్రీ అంటూనే.. భర్తకు డబుల్‌ చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు దఫాలు రైతుబంధు వేసి, మిగితా సీజన్లకు ఎగ్గొట్టారని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రైతులకు యూరియా కష్టాలూ తప్పడం లేదన్నారు. కేసీఆర్‌ పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. రేవంత్‌ సర్కార్‌ పూర్తిగా విఫలం అయిందని ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటు వేయడం దండుగ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ జాతిపిత అని ప్రజలు కోరుకుంటే, అది రేవంత్‌రెడ్డికి నచ్చ డం లేదన్నారు. ఆయన బూతుపితగా మారారని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టడం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పాలన అంతా అవినీతిమయం

మాజీ మంత్రి హరీశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement