హలో.. తమ్మీ | - | Sakshi
Sakshi News home page

హలో.. తమ్మీ

Feb 8 2026 7:54 AM | Updated on Feb 8 2026 7:54 AM

హలో..

హలో.. తమ్మీ

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

పాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఓటర్లను కలుసుకుంటూనే ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారికి గాలం వేస్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమ ఒలకబోస్తున్నారు. యోగక్షేమాలు అడుగుతూ బంధుత్వాలు, పరిచయాలను గుర్తు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఓటర్లను టచ్‌లో ఉంచుకోవటానికి మద్దతుదారులు, అనుచరులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్‌ రోజు పట్టణానికి రప్పించటంతో పాటు వారు వచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చులు చెల్లించేలా పురమాయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగుళూరు, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల సమయం లేదా పండుగలకు వచ్చి వెళ్తుంటారు. మెదక్‌ పట్టణంలో 32 వార్డులు ఉండగా, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కలిపి 151 మంది బరిలో ఉన్నారు. ప్రచారానికి రెండు రోజులే సమయం ఉండటంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మా ఓట్లు వద్దా?

భ్యర్థులు ప్రచారానికి కొందరినే పిలిస్తే... మరికొందరు మా ఇంట్లో ఓట్లు వద్దా? మమ్ములను ప్రచారానికి పిల్వకుంటే మా ఓట్లు వేయం.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఓట్లు పోతాయన్న భయంతో అభ్యర్థులు అందరిని వెంట తీసుకెళ్తున్నారు. ప్రచారంలో నడవలేని వృద్ధులు సైతం పాల్గొంటున్నారు. ఒక్కొక్కరికి రూ. 200 కూలి ఇస్తున్నారు.

మన వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిని..

వలస ఓటర్లకు అభ్యర్థుల గాలం

కచ్చితంగా వచ్చి ఓటు వేయాలని వేడుకోలు

రవాణా చార్జీలు చెల్లిస్తామని హామీలు

‘హలో.. తమ్మీ నేను... ఈసారి మన వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నా.. అక్కడ పని బాగా ఉంటుందా..? ఈసారి మీ ఇంట్లో ఓట్లన్నీ నాకే పడాలి.. ఖర్చులకు పంపుతున్న, పోలింగ్‌ రోజు తప్పకుండా రావాలి.. నాకు ఓటేసి గెలిపించాలి ప్లీజ్‌.. మన వార్డును అభివృద్ధి చేసేందుకే పోటీ చేస్తున్నా.. నాకు మద్దతు ఇవ్వాలి.. అవసరమైతే రానుపోను రవాణా చార్జీలు భరిస్తాను’ అంటూ అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండే వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు.

– మెదక్‌ కలెక్టరేట్‌

హలో.. తమ్మీ1
1/2

హలో.. తమ్మీ

హలో.. తమ్మీ2
2/2

హలో.. తమ్మీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement