పకడ్బందీగా ఓట్ల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

Feb 8 2026 7:54 AM | Updated on Feb 8 2026 7:54 AM

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

మెదక్‌ కలెక్టరేట్‌: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా జరగాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు కౌంటింగ్‌ అధికారులు ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు, కౌంటింగ్‌ టేబుల్స్‌, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెంట్లు, అభ్యర్థులతో వ్యవహరించాల్సిన తీరు వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు కలిపి 31 కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 62 కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించినట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఆర్‌ఓ భుజంగరావు, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement