కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

Feb 8 2026 7:54 AM | Updated on Feb 8 2026 7:54 AM

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

తూప్రాన్‌: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సా ధ్యమని మైనార్టీశాఖ మంత్రి అజారుద్దీన్‌ అన్నారు. శనివారం తూప్రాన్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల అధికార దాహాం తీరక కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నారని విమర్శించారు. వారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. కేసీఆర్‌ సొంత కూతురే బీఆర్‌ఎస్‌లో జరిగిన అవినీతిని బయటపెట్టారని, అయినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేట ఎమ్మెల్యే అని, ఆయనకు గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏం పని అని ప్రశ్నించారు. అనంతరం 1వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్‌ రవీందర్‌గుప్త, నాయకులు మామిళ్ల కృష్ణ, భాస్కర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement