ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. బుధవారం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఏడుపాయల్లో మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించాలని కోరారు. సుమారు 10 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్, రోడ్ల మరమ్మతు, తాగునీరు, 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారులతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. 150 మంది గజ ఈతగాళ్లను నియమించాలని, ఐదు ప్రదేశాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాన్నారు. 300 మందితో వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రతి రోజు 140 ఆర్టీసీ బస్సులతో ,ప్రయాణికులకు రవాణ సౌకర్యం కల్పించాలన్నారు. బందోబస్తు నిర్వహణలో భాగంగా 829 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, ,ఈఓ వీరేశం, తహసీల్దార్ సతీష్ కుమార్, శ్రీనివాస్ చారి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
అసమానతలు లేని తెలంగాణ
అసమానతలు లేని తెలంగాణ స్థాపించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపు నిచ్చారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.
ఘనంగా జాతర ఏర్పాట్లు ఉండాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
ఏడుపాయల జాతరపై సమీక్ష


