కాంగ్రెస్‌ను గెలిపిస్తే మరిన్ని నిధులు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను గెలిపిస్తే మరిన్ని నిధులు

Feb 6 2026 7:11 AM | Updated on Feb 6 2026 7:11 AM

కాంగ్రెస్‌ను గెలిపిస్తే మరిన్ని నిధులు

కాంగ్రెస్‌ను గెలిపిస్తే మరిన్ని నిధులు

రామాయంపేట(మెదక్‌)/మెదక్‌జోన్‌/నర్సాపూర్‌, నర్సాపూర్‌ రూరల్‌: కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మెదక్‌ జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ అన్నారు. బుధవారం ఆయన రామాయంపేటలో మీడియాతో, మెదక్‌ నర్సాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తామిచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. రెండేళ్లలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఏడుపాయల ఆలయ అభివృద్ధికి రూ.35కోట్లు, సీఎస్‌ఐ చర్చ్‌కి రూ.29 కోట్లు కేటాయించామని వివరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం కమీషన్‌లే ధ్యేయంగా పనిచేసిందని విమర్శించారు. మిషన్‌ భగీరథ పేరుతో రూ.65కోట్లు స్వాహా చేశారన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిందని విమర్శించారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.15 కోట్లు మంజూరు చేశామని, మరో రూ.30కోట్లు త్వరలో కేటాయిస్తామన్నారు.

మంత్రి వివేక్‌

సమష్టిగా పనిచేస్తే విజయం మనదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement