కర్రుకాల్చి వాత పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

కర్రుకాల్చి వాత పెట్టాలి

Feb 6 2026 7:11 AM | Updated on Feb 6 2026 7:11 AM

కర్రుకాల్చి వాత పెట్టాలి

కర్రుకాల్చి వాత పెట్టాలి

నర్సాపూర్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు బంద్‌ చేసి హామీలన్నీ ఎగ్గొట్టారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్‌ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి 14 రోజుల పాటు అమెరికాకు పోయినప్పుడు టీవీల్లో శబ్ధ కాలుష్యం తగ్గిందన్నారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడించి కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. రేవంత్‌రెడ్డివన్నీ తొండి మాటలేనన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే నర్సాపూర్‌ అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రబడ్జెట్‌లో ఏపీకి నిధులు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపిందని విమర్శించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్‌కు కాంగ్రెస్‌ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలని, ఎగిరిపడితే ప్రజలు రాళ్లతో కొడుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సంగీత, అనుసూయ అశోక్‌గౌడ్‌, నయిమోద్దీన్‌, సత్యనారాయణగౌడ్‌, సునీతాబాల్‌రెడ్డి, కండెల రాజు, సమీన బేగం, షేక్‌హుస్సేన్‌, కళ్యాణి, హమీద్‌, శ్రావ్య, మంజుల, మోహిన్‌అలీ, వినయ్‌కుమార్‌, సరిత, లలితలను పరిచయం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌ డ్‌, గోపి, మన్సూర్‌, శేకర్‌, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

రైతు బంధు వేసి ఓట్లు అడగాలి

మెదక్‌జోన్‌: బీఆర్‌ఎస్‌ అంటే కాంగ్రెస్‌కు వెన్నులో వణుకు పుడుతోందని హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతోనే తమ పార్టీ అభ్యర్థులను ఎత్తుకుపోయి ఏకగ్రీవం చేయిస్తున్నారని, రాబోయే రోజుల్లో అమ్ముడుపోయిన వారిని, ఎత్తుకు పోయిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పోలింగ్‌లోపు రైతుబంధు వేసి ఓట్లు అడగాలని, లేకుంటే మెదక్‌ జిల్లా ప్రజలు చీరి చింతకు కడతారని హెచ్చరించారు. మెదక్‌ ప్రత్యేక జిల్లాతోపాటు రైలు, మెడికల్‌ కళాశాల, ఆస్పత్రి, ఘనపురం ఆనకట్ట కాల్వలు, రోడ్లు, కలెక్టరేట్‌, ఎస్పీ, జెడ్పీ కార్యాలయాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నిర్మించినట్లు వివరించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సురేందర్‌గౌడ్‌, మల్లికార్జున్‌గౌడ్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement