తప్పులు దొర్లొద్దు | - | Sakshi
Sakshi News home page

తప్పులు దొర్లొద్దు

Jan 31 2026 9:28 AM | Updated on Jan 31 2026 9:28 AM

తప్పులు దొర్లొద్దు

తప్పులు దొర్లొద్దు

ఎన్నికల అబ్జర్వర్‌ రవికిరణ్‌

మనోహరాబాద్‌/రామాయంపేట/తూప్రాన్‌: మున్సిపల్‌ ఎన్నికలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని, సక్రమంగా నిర్వ హించేలా అధికారులు కృషి చేయాలని ఎన్నికల అబ్జర్వర్‌ రవికిరణ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని లింగారెడ్డిపేట శివారులో వాహనాల చెక్‌ పాయింట్‌ను పరిశీలించి సూచనలు చేశారు. విధుల్లో అలసత్వం వహించొద్దన్నారు. ఆయన వెంట వెంట తహ సీల్దార్‌ ఆంజనేయులు, ఆర్‌ఐ నాగరాజు ఉన్నారు. అలాగే తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్‌ ప్రక్రియ కొనసాగాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, కమిషనర్‌ గణేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం రామాయంపేట మున్సిపాలిటీలో నామినేష న్ల ప్రక్రియను కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తో కలిసి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియలో త ప్పులు దొర్లకుండా పూర్తి చేయా లని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement