కుస్తీమే సవాల్
మండలంలోని వెల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్త జన సందోహం మధ్య కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చివరి కుస్తీలో కామారెడ్డి జిల్లా అంతాపూర్‌కు చెందిన గంగాధర్‌ఇద్దరిపై గెలుపొందారు. విజేతకు సర్పంచ్ నిరూడిదాసు 5 తులాల వెండి కడియం, నగదు అందజేశారు. – టేక్మాల్(మెదక్)


