రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేద్దాం
మెదక్‌మున్సిపాలిటీ/మెదక్ కలెక్టరేట్/మెదక్‌జోన్/రామాయంపేట: అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. హెల్మెంట్ లేకుండా ద్విచక్ర వాహనం, సీటు బెల్టు లేకుండా కారు నడపరాదన్నారు. నిబంధనలు పాటించని కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదని వాపోయారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వాహ నం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడటం, మ ద్యం సేవించడంతోనే ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీఓ వెంకటస్వామి, ఈఈ వేణు, డీఎస్పీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కుల నిర్మూలన జరగాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. బాధితులకు సత్వరమే పరిహారం అందించాలని ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అలాగే పట్టణంలోని టీఎన్‌జీఓ భవన్‌లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందజేయడంలో ఉద్యోగుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు క్యాలెండర్, డైరీనీ ఆవిష్కరించారు. రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


