ప్రజలను మోసం చేశారు
రామాయంపేట(మెదక్): పదేళ్ల పాటు అధికారంలో ఉండి బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం పట్టణంలోని ఒకటో వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అన్ని గ్రామాల్లో వందల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, దాసరి వాడలో పూరి గుడిసెల్లో ఉంటున్న 40 కుటుంబాలకు ఇళ్ల మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఒకటో వార్డు అభ్యర్థి లావణ్య, ఏడో వార్డు అభ్యర్థి నాగరాజు, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘సీపీఎస్‌ను రద్దు చేయాలి’
పాపన్నపేట(మెదక్): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేస్తామన్న ప్రభు త్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం ఏడుపాయలలో జరిగిన జిల్లా కా ర్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్‌సీ కమిటీ ని వేదికను వెంటనే బహిర్గతం చేయాలని, పెండింగ్ డీఏలు ప్రకటించాలన్నారు. కేంద్రంతో సంప్రదించి టెట్ రద్దు చేయాలని కోరారు. సమస్యలు నెరవేర్చక పోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎల్లం, సిద్దు, రాష్ట్ర బాధ్యులు భాస్కర్, లక్ష్మ ణ్, రంగారెడ్డి, రామారావు, వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు.


