కాంగ్రెస్‌వి కక్ష సాధింపు చర్యలు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకుల నిరసనలు
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ ద్వారా కేసీఆర్‌కు నోటీసులు ఇప్పించి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలో పార్టీ నాయకులతో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పథకాలు బాగున్నాయని ఎకనామిక్ సర్వే ప్రశంసిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిట్ పేరిట నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే నోటీసులిచ్చారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనలను సైతం సిట్ అధికారులు ఉల్లంఘించారని వాపోయారు. అనంతరం చౌరస్తాలో పార్టీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గోపి, శేఖర్, అశోక్‌గౌడ్, నయిమోద్దీన్, సత్యంగౌడ్, బాల్‌రెడ్డి, భిక్షపతి, షేక్ హుస్సేన్, కండెలరాజు, ఆంజనేయులుగౌడ్, వినయ్, మహేందర్‌గౌడ్, సంతోష్, విఠల్, ప్రసాద్, నాగరాజుగౌడ్, శ్రవణ్‌కుమార్, సద్దాం, మన్సూర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి
రామాయంపేటలో ఉద్రిక్తత
రామాయంపేట(మెదక్): కేసీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆదివారం ఆపార్టీ కార్యకర్తలు రామాయంపేటలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా మెదక్ రోడ్డు వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, పలువురు సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌వి కక్ష సాధింపు చర్యలు


