పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంటర్‌ను శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు శని, ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం పట్టణంలోని బా లుర సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని గదులు, వంటలు, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యాబోధన, హాస్టల్ పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


