మోసమే కాంగ్రెస్ నైజం
● కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం ● మాజీ మంత్రి హరీశ్‌రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): అనేక హామీలతో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని, మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కిష్టాపూర్‌లోని సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదని, వారికి సకాలంలో యూరియా అందడం లేదని, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవండతో ౖతీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసం రాజిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రేక్ పాయింట్ ఏర్పాటు చేయండి
సిద్దిపేటజోన్: సిద్దిపేట ప్రాంతంలో రైలు సౌకర్యం ఉందని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక రేక్ పాయింట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులకు సూచించారు. గురువారం పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.


