పుర పీఠం కై వసం చేసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

పుర పీఠం కై వసం చేసుకుంటాం

Jan 29 2026 8:35 AM | Updated on Jan 29 2026 8:35 AM

పుర పీఠం కై వసం చేసుకుంటాం

పుర పీఠం కై వసం చేసుకుంటాం

నర్సాపూర్‌: నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం దక్కించుకుంటామని ఎమ్మెల్యే సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలం అయిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే నర్సాపూర్‌ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని వివరించారు. ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టికెట్‌ దక్కని వారు నిరాశ చెందవద్దని, పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్‌ పదవులు ఇచ్చి గుర్తింపు ఇస్తామన్నారు. సమన్వయకర్త ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అగ్రనేతలు అన్ని మున్సిపాలిటీల్లో సర్వే చేయించారని, సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తారని తెలిపారు. రెండోసారి చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, నాయకులు గోపి, అశోక్‌గౌడ్‌, నయీం, సత్యంగౌడ్‌, భిక్షపతి, బాల్‌రెడ్డి, రాకేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒక్కో వార్డుకు చెందిన నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement