జిల్లాలో యూరియా కొరత లేదు
పాపన్నపేట(మెదక్): నిబంధనల మేరకు యూ రియా విక్రయాలు జరపాలని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ ఆదేశించారు. బుధవారం కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘంలో అధికారులతో మాట్లాడారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. ఇప్పటివరకు 1,752 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, మరో 432 మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజుల్లో వస్తుందని తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావ్దొద్దని సూచించారు. ఈనెల 26 వరకు యాసంగి పంటకు 5,385 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 2.95 లక్షల ఎకరాల వరి పంట వేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. సొసైటీ సిబ్బంది, ఈ–పోస్ మిషన్ ద్వారా విక్రయాలు చేపట్టాలన్నారు. రైతుల అవసరం మేరకు, ఎమ్మార్పీ రేటుకు యూరియా విక్రయించాలని సూచించారు. సమావేశంలో డీసీఓ, సొసైటీ పర్సన్ ఇన్‌చార్జి శంకర్, ఏడీఓ విజయలక్ష్మి, ఏఓ శ్రీనివాస్‌రాజు, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, రైతులు పాల్గొన్నారు.
డీఏఓ దేవ్‌కుమార్


