గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు
మెదక్‌జోన్/రామాయంపేట(మెదక్): గెలిచే సత్తా ఉన్న వారు ఏ పార్టీలో ఉన్నా చేర్చుకొని టికెట్లు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీలన్నీ గెలుస్తామని, హరీశ్‌రావు మెదక్ తొంగి చూడొద్దన్నారు. ఇతర పార్టీల నేతలతో ఎన్నికలు అయ్యేవరకు మాట్లాడొద్దని కార్యకర్తలను ఆదేశించారు. టికెట్లు రాని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు. పార్టీకి నష్టం చేసేవారు ఎవరైనా క్షమించమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీలో 22 నుంచి సర్వే జరుగుతుందని, 48 గంటల్లో సర్వే రిపోర్టు వస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు మండలంలోని సుతారిపల్లి, శివ్వాయపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రమణ, రమేశ్‌రెడ్డి, సరాపు యాదగిరి, మహేందర్‌రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు


