సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
● 1,200 మంది ముందస్తు బైండోవర్
మెదక్ కలెక్టరేట్/రామాయంపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యలు సృష్టించే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే గతంలో నేర చరిత్ర కలిగిన సుమారు 1,200 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 21 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రచారం చేస్తే సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు రూ.50 వేలకు మించి నగదు త రలించొద్దన్నారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, పట్టణ సీఐ మహేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. అనంతరం రామాయంపేట మున్సిపాలిటీలో నామినేషన్ కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలు సాఫీగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు.


