ఎన్నికలప్పుడే సిట్ నోటీసులా?
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: ఎన్నికలు రాగానే సిట్ నోటీసులు ఇస్తూ తమ పార్టీ అగ్ర నాయకులను ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్‌ను విచారణకు రావాలని పార్టీ నాయకుల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ పార్టీలో టికెట్ దక్కని వారిని కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల్లో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. చైర్మన్ పదవిని బీఆర్‌ఎస్ రెండోసారి దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. సర్వేల ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. అనంతరం పట్టణంలోని 15 వార్డులకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.


